కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నై విమానాశ్రయానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) ఆ రాష్ట్ర సీఎం జోసెఫ్ విజయ్ (CM Vijay) ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన ప్రధాని మోదీకి సీఎం విజయ్ పూల బుట్టను అందించారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా తమిళనాడు రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా 5 అమృత్ స్టేషన్లతో పాటు పలు కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
ఇదిలా ఉండగా ఇటీవల చెన్నై వచ్చిన లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. సీఎం విజయ్ నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ సమకాలీన రాజకీయాలపై చర్చించారు. అనంతరం విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ పాల్గొని విద్య, పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం వంటి అంశాలపై మాట్లాడారు. నిన్న రాహుల్ గాంధీ, నేడు ప్రధాని మోదీని తమిళనాడు సీఎం విజయ్ కలవడం చర్చనీయాంశంగా మారింది.
దీంతో విజయ్ చుట్టూ జాతీయ రాజకీయాలు తిరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వరుసగా ఇద్దరూ జాతీయ స్థాయి నేతలతో విజయ్ కనిపించడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ(PM Modi)తో సన్నిహిత సంబంధాలను విజయ్ నెలకొల్పొతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : నేను కిడ్నాప్ చేయబడ్డాను: ధ్రువ్ రాఠీ సంచలన వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

