ఫిఫాపై సైబర్ ఎటాక్.. కీలక పైళ్లకు యాక్సిస్

క‌లం, స్పోర్ట్స్: ఫిఫాపై మరోసారి సైబర్ దాడి (FIFA Cyberattack) జరిగింది. కొందరు దుండగులు స్టాఫ్ మెంబర్ల ముసుగులో సైబర్ దాడి చేశారని, కొంత బిజినెస్, పర్సనల్ సమాచారానికి యాక్సిస్ పొందారని ఫుట్‌బాల్ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఫిఫా అధికారికంగా వెల్లడించింది. హ్యాకర్లు ఇమ్మిగ్రేషన్, ఆర్థిక లావాదేవాలు, కొన్ని వ్యక్తిగత డాక్యుమెంట్స్‌కు యాక్సెస్ పొందు ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి హ్యాండ్సమ్ బాయ్ హ్యాకింగ్ క్లబ్ ఈ సైబర్ దాడికి బాధ్యత తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 19న ఫిఫాకు సంబంధించిన ఫైళ్ల స్క్రీన్‌షాట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఈ సైబర్ దాడికి ఫిఫా అధికారింగా ధృవీకరిస్తూ తాజాగా స్పందించింది.

అయితే, ఈ దాడిలో వివాదాస్పద ఫిఫా ఫార్వర్డ్ ఎంటర్‌ప్రైజ్ (ఎఫ్‌ఎఫ్‌ఈ) ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం చోరీ కాలేదని నివేదికలు వెల్లడించాయి. సైబర్ దాడిని ఫిఫా తీవ్రంగా ఖండించింది. సంబంధిత అధికారులతో పాటు పోలీసు దర్యాప్తు సంస్థలతో కలిసి విచారణ చేపట్టినట్లు తెలిపింది. వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా సేకరించడం, బహిర్గతం చేయడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>