ఢిల్లీలో CJP కీలక నేతల విడుదల.. కాసేపట్లో ప్రెస్‌మీట్!

కలం, వెబ్ డెస్క్ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు తలపెట్టిన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ కీలక నేతలు (CJP Leaders) అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకా విడుదలయ్యారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ పిలుపునిచ్చిన ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందుస్తుగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన ఈ ముగ్గురు నేతలను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే శనివారం ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారిని నిర్బంధించిన పోలీసులు, ఆదివారం ఢిల్లీ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. తదనంతరం చట్టపరమైన ప్రక్రియను అనుసరించి వారిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అరెస్టులను సీజేపీ తీవ్రంగా ఖండించడమే కాకుండా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కును పోలీసులు కాలరాస్తున్నారని మండిపడింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు CJP జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకా ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>