Mobile Popup Ad
Mobile Popup Ad

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి శారీరక సంబంధం పెట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసిన వ్యక్తి బెయిల్ పిటిషన్​ ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘మనం పాత ఫ్యాషన్​ వాళ్లమే కావచ్చు.. కానీ పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులు. వారి ప్రేమ ఎలా ఉన్నా పెళ్లికి ముందు శారీరక సంబంధం ఎలా పెట్టుకుంటారో అర్థం కావడం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడదు’ అంటూ జస్టిస్ బి.వి. నాగరత్న వ్యాఖ్యానించారు.

ఒక ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కేసులో బెయిల్ పిటిషన్ పై అత్యున్నత నాయస్థానం (Supreme Court ) విచారణ చేపట్టింది. కేసు వివరాల ప్రకారం. ఓ మహిళను మ్యాట్రిమోనిలో కలిసిన వ్యక్తి పెళ్లి చేసుకుంటానని హామినిచ్చి పలుసార్లు ఆమెతో శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో వాళ్లిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియోలను రికార్డు చేశాడు. దీనిపై ప్రశ్నించిన మహిళను బెదిరించాడు. అయితే, అతడు రెండో పెళ్లి చేసుకోవడంతో మోసపోయానని గ్రహించిన మహిళ అతడిపై అత్యాచారం కేసు పెట్టారు. విచారణలో భాగంగా జస్టిస్​ బి.వి నాగరత్న ఫిర్యాదు చేసిన మహిళకు పలు ప్రశ్నలు సంధించారు. ‘వివాహం చేసుకుంటామని అనుకున్నప్పుడు ముందుగానే శారీరక సంబంధం ఎందుకు పెట్టుకున్నారు. ఇది పరస్పర అంగీకారంతో జరిగిందేమో. ఈ కేసులో దోషిగా నిర్ధారించలేం. మధ్య వర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Read Also: ఇజ్రాయెల్​ టూరిస్ట్​​పై రేప్​.. ముగ్గురికి మరణశిక్ష

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>