కలం, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ (Chennur Municipality)పై కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సాధించింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్, ఛైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా పెద్దింటి పద్మ, వైస్ ఛైర్మన్‌గా నాయకపు వినయ్ కుమార్ ఎన్నికయ్యారు. అనంతరం వీరు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
చెన్నూరు మున్సిపాలిటీ (Chennur Municipality)లో మొత్తం 18 వార్డులు ఉండగా, వాటిలో కాంగ్రెస్ పార్టీ 11 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన ఆధిక్యం పొందింది. బీఆర్ఎస్ పార్టీ 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలతో మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు బలపడింది.
మున్సిపల్ ఎన్నికల అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఛైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు. రిజర్వేషన్ ప్రకారం ఈసారి ఛైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు కేటాయించబడగా, పెద్దింటి పద్మ ఏకగ్రీవ మద్దతుతో ఆ పదవిని దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడిన పెద్దింటి పద్మ, పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం తమ ప్రాధాన్యతలుగా ఉంటాయని తెలిపారు. ప్రజల విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. వైస్ ఛైర్మన్ నాయకపు వినయ్ కుమార్ కూడా పట్టణ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
Read Also: ఇండియాలో మళ్లీ నిలిచిన X సేవలు
Follow Us On : WhatsApp


