కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “వారణాసి” (Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాణంలో సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళం స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ భారీ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ను గత ఏడాది నవంబర్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
ఆ టీజర్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ టీజర్‌ను పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’ (Le Grand Rex) థియేటర్‌లో ప్రదర్శించబోతున్నారు. ఇలా పారిస్‌లో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ జరుపుకుంటున్న తొలి ఇండియన్ ఫిల్మ్ గా ‘వారణాసి’ (Varanasi) చరిత్ర సృష్టించబోతోంది. ఈ చారిత్రాత్మక ప్రదర్శన నేడు (జనవరి 5) రాత్రి 9 గంటలకు జరగనున్నట్లు ఫ్రెంచ్ పంపిణీ సంస్థ ‘ఆన్నా ఫిల్మ్స్’ అధికారికంగా ప్రకటించింది.ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాకు గ్లోబల్ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసిన రాజమౌళి వారణాసి తో అంతకు మించి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Read Also: వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ .. రాజమౌళి మాస్టర్ ప్లాన్ అదిరిందిగా
Follow Us On: Youtube


