epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మెస్సీని కలవడానికి నో చెప్పిన సునీల్ ఛెత్రి.. ఎందుకంటే..!

కలం డెస్క్: భారత ఫుట్‌బాల్‌ దిగ్గజం సునీల్‌ ఛెత్రి(Sunil Chhetri).. లియోనెల్‌ మెస్సీని కలిసే ఆహ్వానాన్ని వినయంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈ నెలలో మెస్సీ భారత్‌కు రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మెస్సీ పర్యటన షెడ్యూల్‌లో ఫుట్‌బాల్‌కు సంబంధించిన కార్యక్రమాలు లేకపోవడం వల్లే, ఈ భేటీ భారత ఫుట్‌బాల్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చదని ఛెత్రి భావించినట్లు తెలుస్తోంది.

డిసెంబర్‌ 13 నుంచి 15 వరకు మెస్సీ కోల్‌కతా, హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించనున్నాడు. అయితే ఈ పర్యటన ఎక్కువగా అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకే పరిమితమవుతుండటంతో ఛెత్రి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ భవితవ్యం అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో, స్టార్‌డమ్‌కంటే భారత ఫుట్‌బాల్‌ వ్యవస్థ బలోపేతమే తనకు ముఖ్యమన్న సందేశాన్ని ఛెత్రి(Sunil Chhetri) ఈ నిర్ణయంతో ఇచ్చాడు.

Read Also: మెస్సీతో ఫొటోకు రూ.10 లక్షలు, 100 మందికి మాత్రమే ఛాన్స్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>