కలం, వెబ్ డెస్క్: విద్య, వైద్యం, ఉపాధి అన్ని రంగాలకు కేరాఫ్ కావడంతో హైదరాబాద్ (Hyderabad) గ్లోబల్ సిటీగా పేరొందుతోంది. వ్యాపార రంగంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఆసియా టాప్ స్ట్రీట్స్‌లో చోటు దక్కించుకుంది. ‘కుష్మాన్, వేక్‌ఫీల్డ్ మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2025’ నివేదికలో ఆసియాలో 50 షాపింగ్ వీధుల్లో బంజారా హిల్స్, హిమాయత్‌నగర్ జాబితాలో 48వ స్థానంలో ఉన్నాయి. దీంతో ఆసియా-పసిఫిక్ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ ఏకైక నగరంగా నిలిచింది.
బంజారా హిల్స్ (Banjarahills)లో చాలాకాలంగా బోటిక్‌లు, కేఫ్‌లు, స్టోర్‌లు, డిజైనర్ స్పేస్‌లకు చిరునామాగా ఉంది. దేశంలోని ఫేమస్ బ్రాండ్స్ వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. అలాగే హిమాయత్‌నగర్(Himayatnagar) షాపింగ్ అడ్డాగా మారింది. ఆభరణాల దుకాణాలు, బేకరీలు, బుక్ స్టాల్స్, స్టేషనరీ దుకాణాలున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రిటైల్ బ్రాండ్స్‌ను కోరుకుంటుండటంతో షాపింగ్ డెస్టినేషన్‌గా మారింది.
ఈ గుర్తింపు హైదరాబాద్(Hyderabad) రిటైల్ ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా పోటీగా మారుతోందని తెలియజేస్తోంది. అనేక అంతర్జాతీయ బ్రాండ్లు క్రమంగా నగరంలోకి దొరుకుతుండటంతో హైదరాబాద్ వీధులు షాపింగ్ అడ్డాగా మారుతున్నాయి.
Read Also: మెస్సీని కలవడానికి నో చెప్పిన సునీల్ ఛెత్రి.. ఎందుకంటే..!
Follow Us On: Pinterest


