కలం, వెబ్ డెస్క్: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్‌కు వస్తుండటంతో ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసులు నగరంలో కఠిన ఆంక్షలు అమలుచేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ఉప్పల్(Uppal) పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భాగంగా చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మెస్సీలో బరిలో దిగబోతుండటం, మ్యాచ్‌ను చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) వస్తుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో మెస్సీ(Messi)తో ఫొటో దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు రూ.10 లక్షలు పే చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ యాప్‌లో అభిమానులు, ప్రముఖులు టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 100 మందికి మాత్రమే అవకాశం దక్కనుంది. కోల్‌కతా ఘటన నేపథ్యంలో పోలీసులు, ఉన్నతాధికారులు గట్టి బందోబస్తు చర్యలను చేపట్టారు.
Read Also: కోల్ కత్తా నుంచి హైదరాబాద్ వస్తున్న మెస్సీ
Follow Us On: Sharechat


