epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అందుకే రూ.40కోట్ల ఆఫర్​ వదులుకున్నా: సునీల్​ శెట్టి

కలం, వెబ్​డెస్క్​: తన పిల్లలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే తాను రూ.40కోట్ల ఆఫర్​ వదులుకున్నట్లు బాలీవుడ్​ నటుడు సునీల్​ శెట్టి (Suniel Shetty) తెలిపారు. మంచి నటుడిగానే కాకుండా, ఆదర్శవంతమైన వ్యక్తిగానూ నిలవాలని కోరుకున్నట్లు చెప్పారు. మూడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో సునీల్​ శెట్టి.. అనేక ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు అహాన్​, అతియా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీల్​ శెట్టి మాట్లాడుతూ తన జీవితం, కుటుంబం గురించిన విషయాలు పంచుకున్నారు. ‘ నేను నమ్మిన విలువలు, నమ్మకాలు నా జీవితం, కెరీర్​పై ప్రభావం చూపించాయి. నేను నా పిల్లలకు ఆదర్శంగా నిలవాలనుకున్నా.

అందుకే పొగాకు ఉత్పత్తుల ప్రచారం కోసం రూ.40కోట్ల ఆఫర్​ వస్తే తిరస్కరించా. నాకు డబ్బు అవసరం ఉండొచ్చు. కానీ, నాకు ఇష్టంలేని పనిని చేయను. ముఖ్యంగా నా పిల్లలు అహాన్​, అతియాకు నా కారణంగా మచ్చ వచ్చేవేవీ నేను చేయను. అందుకే ఆ తర్వాత ఎవరూ ఇలాంటి ఆఫర్లతో నా దగ్గరికి రాలేదు.’ అని సునీల్​ శెట్టి వెల్లడించారు.

తండ్రి వీరప్ప శెట్టి మరణం, కెరీర్​లో గ్యాప్ గురించి సునీల్​ శెట్టి (Suniel Shetty) మాట్లాడుతూ ‘ నా తండ్రి 2014 నుంచి అనారోగ్యంతో బాధపడేవాడు. ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాణ్ని. ఆ సమయంలో నా మానసిక స్థితి అంత బాగోలేదు. దాంతో సినిమాలు వదిలేశాను. అయితే, 2017లో నా తండ్రి చనిపోయిన రోజే నాకొక ఆఫర్​ వచ్చింది. అదొక సూచనగా భావించి మళ్లీ నటన వైపు అడుగువేశాను. అయితే, గ్యాప్​ తర్వాత నటించడం అంత సులువు కాదు. అన్నీ మారిపోతాయి. అందరూ కొత్తవాళ్లలా అనిపిస్తుంది. కానీ, దక్షిణాది సినిమాలతో నేను సెకండ్ ఇన్నింగ్స్​ మొదలుపెట్టా’ అని చెప్పారు.

కరోనా తర్వాత తన జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకున్నట్లు సునీల్​ శెట్టి తెలిపారు. పుస్తకాలు చదవడం, వ్యాయామం, వేర్వేరు అంశాల్లో శిక్షణ వంటి వాటి ద్వారా తనను తాను  మెరుగుపర్చుకున్నట్లు వెల్లడించారు. తాను సినిమాల్లో లేని సమయంలోనూ తనను గుర్తుపెట్టుకున్న అభిమానులకు, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Read Also: యాంకర్ సుమ కామెంట్లపై వివాదం..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>