Mobile Popup Ad
Mobile Popup Ad

సమ్మర్ హీట్‌తో అలసిపోతున్నారా? శరీరాన్ని కూల్‌గా ఉంచే టిప్స్ ఇవే!

కలం, వెబ్‌డెస్క్: Summer Health Tips | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మండిపోవడం, మిరుమిట్లు గొలిపే ఎండ తీవ్రత, ఉక్కపోతతో కూడిన వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వేసవి కాలం కేవలం ఎండలను మాత్రమే కాదు.. వడదెబ్బ (Sunstroke), డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, నీరసం వంటి ఎన్నో ఆరోగ్య సవాళ్లను కూడా వెంటబెట్టుకుని వస్తుంది. కాబట్టి మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈ కాలంలో అత్యంత కీలకమని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి తరచూ నీరు తాగాలి. నీటిశాతం ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం తాగాలి. టీ, కాఫీ, ఆల్కహాల్, కారం తగ్గించాలి.

వేసవిలో ఎండలు పెరిగే కొద్దీ శరీరంలో నీరు తగ్గిపోతుంది. ఎక్కువగా చెమట పడటం వల్ల నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో అలసట, నీరసం, కొన్నిసార్లు వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో శరీరాన్ని చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కోసం పాటించాల్సిన సులభమైన వేసవి ఆరోగ్య చిట్కాలు (Summer Health Tips) ఇవే.

1. రోజంతా నీరు తాగడం

దాహం వేసే వరకు వేచి ఉండకుండా తరచుగా నీరు తాగాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీరు తాగితే ఇంకా మంచిదట.

2. నీరు ఎక్కువగా ఉన్న ఆహారం

వేసవిలో పుచ్చకాయ, కర్బూజా, నారింజ, ద్రాక్ష వంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కీరదోస, టమాటా, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలు కూడా శరీరానికి నీరు అందిస్తాయి. అందుకే వీటిని మన డైలీ రోటీన్‌లో భాగం చేసుకోవాలి.

3. చల్లని పానీయాలు

మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడి జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. కొబ్బరి నీళ్లు ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా సహాయపడతాయి. నిమ్మరసం, పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని తాజాగా ఉంచుతాయి. నీటిలో నిమ్మకాయ, పుదీనా, దోసకాయ ముక్కలు వేసి తాగితే ఇంకా మంచిది.

4. తినకూడనివి ఇవే

టీ, కాఫీ, శీతల పానీయాలు, ఆల్కహాల్ వంటివి శరీరంలోని నీటిని తగ్గిస్తాయి. అలాగే ఎక్కువగా వేయించిన పదార్థాలు, కారం, మసాలా ఎక్కువ ఉన్న ఆహారం శరీర వేడిని పెంచుతుంది. కాబట్టి వేసవిలో ఇటువంటి పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

5. ఇతర ముఖ్యమైన జాగ్రత్తలు

బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్లడం అస్సలు మర్చిపోవద్దు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. వీలైతే రోజంతా నీరు తాగడం మర్చిపోకుండా ఉండేందుకు ఫోన్‌లో రిమైండర్ పెట్టుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు.

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు.

Read Also: వాచ్‌ ఎప్పుడూ ఎడమ చేతికే ఎందుకు ధరిస్తారు? .. దాని వెనక సైన్స్ ఇదే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>