Mobile Popup Ad
Mobile Popup Ad

జిల్లాలకు మంత్రులు వెళ్లి కొనుగోళ్లను పర్యవేక్షించాలి: కిషన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారని.. ప్రభుత్వమే వారికి సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం డబ్బులిస్తున్నా అన్నదాతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం ఎందుకు కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణకు ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తోందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాలకు మంత్రులు వెళ్లి, ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, తమకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Read Also: బండి సంజయ్‌ కేంద్రమంత్రి పదవిలో కొనసాగడం అవమానకరం : కేటీఆర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>