హనుమకొండలో ప్రైవేట్ స్కూళ్ల ఇష్టారాజ్యం.. జోరుగా ‘ముందస్తు’ అడ్మిషన్స్

కలం వరంగల్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుస్తు అడ్మిషన్లు (Early Admissions) చేపడుతున్నాయి. విద్యా సంవత్సరం పూర్తి కాకముందే ముందస్తు అడ్మిషన్లకు దిగిన విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం హనుమకొండ (Hanamkonda) జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు చేపట్టడం వల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల ఆవరణలోనే పాఠ్యపుస్తకాల విక్రయాలు జరపడం సరైంది కాదన్నారు. ఎమ్మార్పీ ధరలకు మించి అమ్ముతూ పేద ప్రజలను దోపీడి చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందించినవారిలో ఎఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏఐఎస్‌బీ రాష్ట్ర కార్యదర్శి హకీం నవీద్, ఏఐఎస్‌ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోశ్, పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. నరసింహ రావు పాల్గొన్నారు.

Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>