Mobile Popup Ad
Mobile Popup Ad

బళ్లారి గురుకులంలో దారుణం.. విద్యార్థి దాడిలో ఒక‌రు మృతి

క‌లం, వెబ్ డెస్క్‌: కర్ణాటకలోని బళ్లారి (Ballari) జిల్లాలో ఉన్న ఒక గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అంద‌రూ నిద్రలో ఉన్న సమయంలో ఒక విద్యార్థి తోటి విద్యార్థుల‌పై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ఒక‌రు మృతి చెంద‌గా, ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. శ‌నివారం రాత్రి భోజనాలు ముగించుకొని విద్యార్థులు నిద్రిస్తున్నారు. ఆ స‌మ‌యంలో పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి అకస్మాత్తుగా ఒక ఇనుప రాడ్‌తో గ‌దిలోకి వ‌చ్చాడు. నిద్రిస్తున్న విద్యార్థులంద‌రిపై దాడి చేయడం ప్రారంభించాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. మరో ఆరుగురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే బళ్లారి (Ballari) పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులందరినీ వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థి అంతలా రెచ్చిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 Read Also: కుమార్తెలను చెరువులో తోసి.. కన్నతండ్రి కిరాతకం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>