కలం, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని నైనిటాల్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల పర్యాటక యువతిపై ఓ టాక్సీ డ్రైవర్ లైంగిక దాడికి ఒడిగట్టాడు. శుక్రవారం ఆలస్యంగా నైనిటాల్ వెళ్తున్న క్రమంలో గమ్యస్థానానికి పది కిలోమీటర్ల దూరంలోని బల్దియాఖాన్ వద్ద ఈ ఘటన జరిగింది. మార్గమధ్యలో కారు ఆపిన నిందితుడు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించి, తీవ్రంగా గాయపరిచాడు. యువతి గట్టిగా ప్రతిఘటించడంతో భయపడిన డ్రైవర్, ఆమె సెల్‌ఫోన్‌తో పాటు ఇతర సామాగ్రిని లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు లోనైన బాధితురాలు, రాత్రంతా సమీపంలోని అడవిలోనే గడపాల్సి వచ్చింది. మరుసటి రోజు స్థానిక పోలీసులు ఆమెను గుర్తించి రక్షించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన టాక్సీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.
Read Also: కుమార్తెలను చెరువులో తోసి.. కన్నతండ్రి కిరాతకం!
Follow Us On: Sharechat

