కలం, వెబ్ డెస్క్ : నల్గొండ (Nalgonda) బీసీ హాస్టల్‌లో విద్యార్థిని యాసిడ్ తాగింది. జిల్లాలోని అనుముల మండలం హాజారిగూడెంకు చెందిన హేమ నల్గొండ శ్రీనగర్ కాలనీలోని బీసీ హాస్టల్‌లో ఉంటూ నాగార్జున డిగ్రీ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం తెల్లవారు జామున నురుగలుగా వాంతులు చేసుకుంటుండగా గమనించిన తోటి స్టూడెంట్స్ ఆరా తీశారు. బాత్రూమ్‌లోని యాసిడ్ తాగినట్టు హేమ చెప్పింది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంట్లో ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా హేమ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: కవితను కీలు బొమ్మలా ఆడిస్తున్నారు : గొంగిడి సునీత
Follow Us On: X(Twitter)


