కలం, వెబ్ డెస్క్: వరంగల్ (Warangal)లో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. నగరంలోని ఓకాలనీలో ఎనిమిదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేయడంతో కలకలం రేపింది. బాలిక కేకలు విని స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను (Stray Dogs) తరిమికొట్టడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో మరో బాలికపై కూడా కుక్కలు దాడి చేయడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వీధి కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

