‘ధురంధర్ 2’ సక్సెస్.. కంగనా సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం ధురంధర్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లలో రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతుంది. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ దేశభక్తి సందేశంతో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.331 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా( Kangana) రనౌత్ తనదైన శైలిలో స్పందించిన తీరు ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ‘ధురంధర్ 2’ సాధిస్తున్న అఖండ విజయంపై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హాలీవుడ్‌లో స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్వింటిన్ టరాన్టినో, క్రిస్టోఫర్ నోలన్ వంటి దర్శకులకు అక్కడి స్టార్ హీరోల కంటే ఎక్కువ గౌరవం, గుర్తింపు ఉంటాయని.. కానీ భారతీయ చిత్ర పరిశ్రమలో మాత్రం దర్శకులకు సరైన క్రెడిట్ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మన ఇండస్ట్రీలో దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, వారికి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువని ఆరోపించారు. దీంతో కొత్తగా వచ్చే యువత కేవలం నటులు కావాలని అనుకుంటున్నారే తప్ప, డైరెక్టర్లు లేదా సినిమాటోగ్రాఫర్లు కావాలని కలలు కనడం లేదని తెలిపారు.

అయితే ధురంధర్ 2 విజయంతో ఆదిత్య ధర్ ఒక సూపర్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారని ఆమె ప్రశంసలు కురిపించారు. ఏ హీరో కంటే తక్కువ కాకుండా ఆయన మెరుస్తున్నారన్న కంగనా( Kangana).. ఇది చూసి భవిష్యత్తులో ఎంతోమంది యువత దర్శకులు కావాలని ఆశిస్తారని చెప్పుకొచ్చారు. కాగా, తన సోషల్ మీడియా పోస్ట్‌లో కంగనా హీరో రణవీర్ సింగ్ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>