Mobile Popup Ad
Mobile Popup Ad

బాలుడిపై కుక్కల దాడి.. బయటపడ్డ కనుగుడ్డు

కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రిభువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలో వీధి కుక్కలు ఓ బాలుడిపై చేయడంతో ఏకంగా ఆ బాలుడి కనుగుడ్డు ఊడిపడింది. గురువారం పట్టణంలోని తారకరామ్ నగర్ లో జరిగిన ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నాలుగేండ్ల చిన్నారి సందెల ప్రియాంష్ సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న సమయంలో బాలుడిపై ఓ వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడిలో బాబుకు తీవ్రగాయాలు కాగా కనుగుడ్డు బయటకొచ్చింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాబును భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>