కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి షాకింగ్ పోస్టు పెట్టారు. ఇరాన్ తన చుట్టూ ఉన్న పశ్చిమాసియాను ఆక్రమించుకోవాలని చూసిందని సంచలన ఆరోపణ చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఇప్పుడు ప్రయోగిస్తున్న క్షిపణులు యుద్ధానికి ముందే గురి పెట్టి ఉన్నాయని.. వాటిని ఇప్పుడు లోడ్ చేసి ఇరాన్ వదులుతోందని.. దీన్ని బట్టి ఇరాన్ ఉద్దేశం ఏంటో అందరూ అర్థం చేసుకోవాలన్నారు ట్రంప్ (Donald Trump). అమెరికా యుద్ధంలోకి దిగిన తర్వాత పశ్చిమాసియాను ఆక్రమించుకోవడం సాధ్యం కాదని ఇరాన్ కు అర్థమైందని ట్రంప్ చెప్పారు.
ఇరాన్ ముందు 15 పాయింట్లతో తయారు చేసిన ప్రణాళికను ఉంచామని.. ఒప్పందం కుదిరేందుకు బలమైన అవకాశాలు ఉన్నాయని అమెరికా వెల్లడించింది. ఇరాన్ స్వయంగా ఒప్పందం కోసం బతిమాలుతోందని.. తమ నిబంధనలకు ఒప్పుకుంటేనే ఇరాన్ కు మంచి జరుగుతుందని ట్రంప్ చెప్పారు. లేదంటే అమెరికా మళ్లీ దాడులు ప్రారంభిస్తుందని.. అప్పుడు వెనక్కు తిరిగి చూడబోమంటూ ట్రంప్ వెల్లడించారు.

