నకిరేకల్‌లో ఘోరం.. నాలుగేళ్ల బాలుడిపై పిచ్చి కుక్కల దాడి

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ జిల్లాలోని నకరేకల్ పట్టణంలో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఒక పిచ్చి కుక్క ఒక్కసారిగా దాడి (Stray Dog Attack) చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇంటి బయట ఆడుకుంటున్న శరత్ చంద్ర అనే నాలుగేళ్ల బాలుడిపై కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి ముఖంపై లోతైన గాయాలయ్యాయి. ముక్కును తీవ్రంగా కొరకడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఘటనను గమనించిన బాలుడి తాత, నానమ్మలు వెంటనే స్పందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.

కుక్కలు స్వైర విహారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, తమ బిడ్డ పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల భువనగిరిలో జరిగిన ఘటనలో ఒక చిన్నారి కన్ను పోగా, ఇప్పుడు నకిరేకల్‌లో ఈ దారుణం జరగడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. వేసవి కాలం కావడంతో పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారని, అధికారులు తక్షణమే స్పందించి కుక్కల బెడద నుండి రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read Also: పెళ్లయిన నెలకే రష్మిక గుడ్ న్యూస్..?.. ముగ్గురం అయ్యామని పోస్ట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>