కలం, వెబ్ డెస్క్: మహేశ్ బాబుతో కలిసి వారణాసి (Varanasi) మూవీ తెరకెక్కిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli).. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. తాజాగా, మెక్సికోలో జరుగుతున్న ‘కామికాన్ ఎక్స్ పీరియన్స్–2026’ ఈవెంట్ లో మూవీ గ్లింప్స్ విడుదల చేసి మాట్లాడారు. గత 25 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఒక్కో మూవీని తీస్తున్నట్లు వివరించారు. బాహుబలి తరువాత, తాను సినిమాలను చూసే తీరు పూర్తిగా మారిపోయిందన్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవమన్నారు. నాటు నాటు పాటకు అందరూ స్టెప్పులేస్తుంటే.. తన సంతోషాన్ని వర్ణించలేనని పేర్కొన్నారు.
ఇక ప్రపంచ స్థాయిలో..
ఆర్ఆర్ఆర్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయినట్లు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli) అన్నారు. అందుకే, ఇక నుంచి తాను తీసే సినిమాలు ప్రపంచ స్థాయిలో ఉండాలని.. అన్ని దేశాల వారిని ఆకట్టుకునేలా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం, వారణాసి షెడ్యూల్ హైదరాబాద్ లో ముగియడంతో తరువాత అంటార్కిటికా ఖండంలో కీలక సీన్లు తీయబోతున్నారు. హీరో మహేశ్ బాబు ఇప్పటికే అక్కడికి వెళ్లి.. ప్రిపరేషన్ లో ఉన్నట్లు టాక్. 2027 ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Read Also: రాఘవ్ చద్దా గురించి జర్నలిస్ట్ ప్రశ్న.. పరిణీతి ఏం చెప్పిందంటే..?
Follow Us On: Sharechat

