Mobile Popup Ad
Mobile Popup Ad

రాఘ‌వ్ చ‌ద్దా గురించి జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌.. ప‌రిణీతి ఏం చెప్పిందంటే..?

క‌లం, వెబ్‌డెస్క్‌: పార్ల‌మెంట్‌లో సామాన్యుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌సంగాలు చేస్తూ ఎంతో ఫేమ‌స్ అయిన ఎంపీ రాఘ‌వ్ చ‌ద్ధా (Raghav Chadha) ఇప్పుడు నార్త్ టూ సౌత్ హాట్ టాపిక్‌గా మారారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన ఆయ‌న‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న‌కు ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా ఫాలోవ‌ర్లు త‌గ్గిపోయారు. ఇక దీని ఎఫెక్ట్‌తో రాఘ‌వ్‌ చ‌ద్ధా భార్య‌ ప‌రిణీతి చోప్రా (Parineeti Chopra)కు కూడా సోష‌ల్ మీడియాలో 4 వేల‌కు పైగా ఫాలోవ‌ర్లు త‌గ్గారు. ఇదే స‌మ‌యంలో ప‌రిణీతి చోప్రాకు సంబంధించి ఒక వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో రాఘ‌వ్ చ‌ద్ధా ఏ నిర్ణ‌యం తీసుకోనున్నార‌ని ఓ జ‌ర్న‌లిస్ట్ ప‌రిణీతిని ప్ర‌శ్నించారు.

దీనికి ప‌రిణీతి (Parineeti Chopra) త‌న‌కు అవేమీ తెలియ‌వ‌ని, రాఘ‌వ్ అస‌లు త‌న‌తో రాజ‌కీయాల గురించి చ‌ర్చించ‌డ‌ని చెప్పి న‌వ్వేసింది. అయితే నెటిజ‌న్లు మాత్రం అప్ప‌టికే ప‌రిణీతికి రాఘ‌వ్ పార్టీ మారుతున్న‌ట్లు తెలుసు అని, అయినా ఏమీ తెలియ‌న‌ట్లు న‌టించింద‌ని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా రాఘ‌వ్ చ‌ద్ధా పార్టీ మార‌డంతో ఎంతో కొంత ప‌రిణీతికి కూడా ఎఫెక్ట్ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Read Also: అమిత్ షా సిఫార్సు.. వద్దన్న రాహుల్ గాంధీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>