ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ మనందరి బాధ్యత: సంజీవ్ ముదిరాజ్ కాంగ్రెస్‌ నేతలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అంటూ కాంగ్రెస్‌ నేతలు (Congress Leaders) , మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) జయంతి సందర్భంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంగంపల్లి సంజీవ్ ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఎంపీ విఠల్‌రావు (Former MP Vitthal Rao) జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని, స్వాతంత్ర్యం అనంతరం భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు దూరదృష్టితో ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు.

పారిశ్రామిక, విద్యా, వ్యవసాయ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, జాతీయ సమైక్యత వంటి విలువలకు నెహ్రూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన ఆశయాలు నేటికీ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లలంటే ఎంతో ప్రేమ చూపిన ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు దేశం అందిస్తున్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు.
అదేవిధంగా మాజీ ఎంపీ విఠల్‌రావు ప్రజాసేవకు, రాజకీయ రంగానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, ప్రజల కోసం పనిచేసిన నాయకుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుండాలని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఐక్యంగా కృషి చేయాలని సంజీవ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఆవేజ్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, మీడియా సెల్ సిజె బెనహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు రాములు యాదవ్, సాయిబాబా, ఎం.ఏ. కలీమ్, కార్పొరేటర్లు ఫక్రు, గులాం జహీర్, తాహెర్, కాంగ్రెస్ నాయకులు దర్మాపూర్ నర్సింహారెడ్డి, అక్బర్, గంగిరెడ్డి, అబ్రార్ హుస్సేన్, బురెమోని చందు యాదవ్, తిరుపతి నాయక్, రామచంద్రయ్య, అలీం, అకీమ్, మజర్ ఖాన్, నసీరుద్దీన్, నర్సింహా, సేవాదళ్ నాయకులు జగదీష్, వెంకట్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>