కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా డి. శ్రీనివాస్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు రేరాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను ఇటీవల కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కె. మహేశ్వర్‌తో పాటు పలువురు రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో సుధాకర్, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ నరేందర్, రాజేష్, కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: జబ్బుల గుప్పిట్లో భారత్.. సగం మందికి అనారోగ్య సమస్యలు
Follow Us On : WhatsApp

