తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్: నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ (Driver) ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ (RTC JAC) డిమాండ్ చేసింది. కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి, పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్లే దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ (Driver) ఆత్మహత్యాయత్నం ఘటనకు నిరసనగా రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక్క బస్సు కూడా రోడెక్కనివ్వమని హెచ్చరించారు. రవాణా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి, కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది.

Read Also: వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ గొప్పదేశమంటూ కితాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>