Mobile Popup Ad
Mobile Popup Ad

అధికారంలోకి వచ్చాక ప్రతి జర్నలిస్ట్‌కు డబల్ బెడ్‌రూమ్ ఇళ్లు: శ్రీనివాస్ గౌడ్

కలం, వెబ్ డెస్క్: అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్‌కు అక్రిడేషన్ కార్డు జారీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. చిన్న, పెద్ద పత్రికల జర్నలిస్ట్‌లని తేడా చూపకుండా అందరికి ఇవ్వాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్‌గార్డెన్‌లో మహబూబ్ నగర్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రిడేషన్ కార్డులతో పాటు జర్నలిస్ట్ హెల్త్ కార్డులు (Journalists Welfare) తీసుకువచ్చామని గుర్తు చేశారు. జర్నలిస్ట్ కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించామన్నారు. చాలా జర్నలిస్ట్ కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్న ప్రజా సమస్యలు వెలికి తీయాలని.. ప్రభుత్వ పెద్దలను ప్రజల పక్షాన నిలదీయాలని చాలా మంది జర్నలిజం వృత్తిలోకి వచ్చారని చెప్పారు.

తాము అధికారంలో ఉన్న సమయంలో చాలా మందికి డబల్ బెడ్ రూమ్‌లు ఇచ్చామని.. ఇంకా కొందరికి ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఎన్నికల తర్వాత విడతల వారిగా అందరికీ డబల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇద్దామని అనుకున్నామని.. ప్రభుత్వం మారటంతో సాధ్యం కాలేదని చెప్పారు. మళ్ళీ అధికారలోకి వచ్చాక ప్రతి జర్నలిస్ట్‌కు డబల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉన్న పాలకులను కూడా డబల్ బెడ్‌రూమ్ ఇళ్లు, స్థలాల విషయంలో ఐక్యంగా ఉండి కలిసి అడగాలని సూచించారు.

Read Also: మంగళసూత్రాలు, బొట్టు ధరిస్తే సస్పెండ్​ చేస్తాం.. డీజీపీ ఉత్తర్వులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>