కలం, వెబ్ డెస్క్ : యూనిఫాంలో ఉన్నప్పుడు పోలీసు సిబ్బంది మంగళసూత్రాలు, తిలకం వంటి మతపరమైన ఆభరాణాలు ధరిస్తే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తామని బిహార్ డీజీపీ (Bihar DGP) వినయ్ కుమార్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ, సామాజిక అలజడులకు కారణమయింది. పోలీస్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బిహార్ పోలీస్ ఉన్నతాధికారులు ఇటీవల కఠిన చర్యలు తీసుకున్నారు.
యూనిఫాంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినందుకు సుమారు 40 నుంచి 50 మంది పోలీస్ సిబ్బందిని తొలగించారు. ఈ క్రమంలో ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు డ్రెస్ కోడ్ ను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచనలు జారీ చేశారు. వీటిలో పోలీస్ సిబ్బంది.. తిలకం వంటి చిహ్నాలు పెట్టుకోవడానికి అనుమతి లేదు.
అలాగే, మహిళా అధికారులు యూనిఫాంలో ఉన్నప్పుడు గాజులు, కంకణాలు, మంగళసూత్రాలు, ముక్కుపుడక, కమ్మలు లాంటి ఆభరణాలతో పాటు మేకప్ ధరించడంపై నిషేధం విధించారు. డీజీపీ (Bihar DGP) జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నిర్ణయం మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తాయంటున్నారు. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ఉత్తర్వులపై మండిపడుతూ వెంటనే ఆదేశాలను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ
Follow Us On: Sharechat

