కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) లో ఆర్టీసీ బస్సు పెను ప్రమాదం తప్పింది. బస్టాండు లోపలికి వెళ్తున్న బస్సును బోర్ వెల్ బండి వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడగా.. పలువురు గాయాలపాలయ్యారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
దీంతో ప్రయాణికులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గజ్వేల్ నుండి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నర్సాపూర్ బస్టాండు లోపలికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బోరు బండిని పీఎస్ కు తరలించారు.

