కలం, వెబ్ డెస్క్: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు వాడివేడీగా సమావేశాలు మొదలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి (Venkata Ramana Reddy) అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన రాజకీయ నాయకుల వల్లే బయట కొందరు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, కొత్తగా ఎన్నికైన సభ్యులు గౌరవ మర్యాదలతో మాట్లాడాలని, అసెంబ్లీలో థర్డ్ క్లాస్ భాష వాడొద్దని అన్నారు. కాటిపల్లి కామెంట్స్‌కు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కాటిపల్లి ప్రస్తావన చాలా ముఖ్యమైందని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేలా మేం కూడా మాట్లాడుతామన్నారు. అలాగే సీనియర్ బీజేపీ నేతలు హుందాగా మాట్లాడాలని చురకలంటించారు. ఈ విషయమై కాటిపల్లి దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హుందాగా నడుచుకున్నారని అన్నారు. మాకు ఎలాంటి భేషజాలు లేవని, ఇతరులు కూడా మర్యాదగా నడుచుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లినుద్దేశించి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు.
Read Also: రేవంత్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Follow Us On: X(Twitter)


