కలం వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్(MLA Naveen Yadav) నేడు అసెంబ్లీలో మొదటిసారి ప్రసంగించారు. మొదటిరోజే తన నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి అందరినీ ఆలోచింపజేశారు. ముందుగా తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి, తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సభలో మాట్లాడే ప్రతి మాట ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నందున సభా మర్యాదలు కాపాడుతూ ముందుకు సాగుతానన్నారు.
జూబ్లీహిల్స్(Jubilee Hills) ప్రాంతంలో కృష్ణా నగర్(Krishna Nagar)లో 40 ఏళ్ల నుంచి వర్షాకాలం వస్తే ముంపుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై మంత్రులు ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లారని, సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అలాగే హైటెన్షన్ లైన్ల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారని, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టం రూపొందించాలని కోరారు. నియోజకవర్గంలో చాలామంది విద్యార్థులు ఆర్థిక సమస్యలతో పదో తరగతితోనే చదువులు ఆపేస్తున్నారని, నియోజకవర్గానికి ఇంటర్, డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. నవీన్ యాదవ్ (Naveen Yadav) సభ ప్రారంభంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఆశీస్సులు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
Read Also: కేటీఆర్‌కు తండ్రి మీదున్న గౌరవం ఇదేనా?: కాంగ్రెస్ విమర్శలు
Follow Us On : WhatsApp


