కలం, వెబ్ డెస్క్ : అగ్రరాజ్యం అమెరికాకు యుద్ధం వేళ శ్రీలంక షాక్ ఇచ్చింది. అమెరికా చేసిన ఓ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది. ఈ విషయాన్ని శ్రీలంక (Sri Lanka) అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. ఇరాన్ తో ప్రస్తుతం అమెరికా భీకరంగా యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, దేశాల్లో ఉన్న తన ఎయిర్ బేస్ లను అమెరికా ఇప్పుడు ఉపయోగించుకుంటోంది. ఈ క్రమంలోనే ఎర్రసముద్రం ఏడెన్ గల్ఫ్ మధ్య ఉన్న జిబౌటీ స్థావరంలోని అమెరికా ఎయిర్ బేస్ నుంచి శ్రీలంకకు (Sri Lanka) రెండు రిక్వెస్ట్ లు వచ్చాయన్నారు అనుర కుమార.
నౌకలను విధ్వంసం చేసే మిస్సైళ్లతో కూడిన రెండు యుద్ధ విమానాలను శ్రీలంకలోని మట్టాలా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేయడానికి అమెరికా రిక్వెస్ట్ చేసింది. కానీ అమెరికా అభ్యర్థనను తిరస్కరించామని శ్రీలంక అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్ తో అమెరికా యుద్ధం జరుగుతున్న సందర్భంగా తటస్థ వైఖరితోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్ని ఒత్తిడిలు ఉన్నా తాము ఇదే దారిలో పయనిస్తామని అనుర కుమార వెల్లడించారు.

