Mobile Popup Ad
Mobile Popup Ad

పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటాం.. నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ తో యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నాటో మిత్ర దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంలో, ఇరాన్ బెదిరింపులను వ్యతిరేకించడానికి నిరాకరించినందుకు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా నాయకత్వంలోని చర్యలకు నాటో మిత్ర దేశాలు దూరంగా ఉండటంపై ఆయన (Donald Trump) తీవ్రంగా మందలించారు. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఆయిల్ సరఫరా దాదాపు 20-30 శాతం ప్రభావితమవుతుండటంతో పెట్రోల్ ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.. అయితే ఇది ‘మా యుద్ధం కాదు’ అంటూ యూరప్ దేశాలు స్పష్టంగా తిరస్కరించాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ.. నాటో మిత్రులు చాలా మంది ఈ సైనిక చర్యలో చేరలేమని చెప్పారన్నారు. అమెరికా వాళ్లను రక్షిస్తోందని, కానీ వాళ్లు తమకు సహాయం చేయడానికి సిద్ధంగా లేరని తెలిపారు. ఇది నాటో తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఇరాన్ ను పూర్తింగా ఓడించిన తరువాత హర్మూజ్ జలసంధిని రక్షించే బాధ్యత నాటో దేశాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. పిరికివాళ్లను.. దేశద్రోహులను గుర్తుపెట్టుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>