epaper
Wednesday, February 18, 2026
epaper

సాగర్‌ను సందర్శించిన శ్రీలంక మీడియా ప్రతినిధులు

కలం, నాగార్జునసాగర్ బ్యూరో: అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) ను బుధవారం శ్రీలంక (Sri Lanka)కు చెందిన మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. వారం రోజులుగా హైదరాబాద్‌లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 29 మంది నాగార్జునసాగర్‌‌లో పర్యటించారు. నాగార్జునకొండలోని పురావస్తు ఐలాండ్ మ్యూజియం, మూడో శతాబ్దంనాటి పునర్నిర్మిత సింహళ విహారాన్ని సందర్శించారు. 1800 సంవత్సరాల క్రితమే భారతదేశానికి, శ్రీలంకకి ఉన్న అనుబంధం గురించి తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

అనంతరం బుద్ధ చరితవనాన్ని సందర్శించారు. మహస్తూపంలోని సమావేశ మందిరంలో బుద్ధ వనం విశేషాలు తెలిపే లఘు చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాత ధ్యానం చేశారు. స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునకొండకు సంబంధించిన పూర్తి విశేషాలను వివరించారు.

Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>