కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో (Kyathanpally Municipality) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)ను పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గొడవలకు సంబంధించి, మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి కేసు నేపథ్యంలో, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు.
A1 బాల్క సుమన్ (Balka Suman), A2 మూల రాజిరెడ్డి, A4 దోమకొండ అనిల్, A8 రామిడి లక్ష్మీకాంత్ నలుగురికి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ అనంతరం నిందితులను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బాల్క సుమన్ అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇందుకు నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్త బంద్‌కి బీఆర్ఎస్(BRS) పిలుపునిచ్చింది.
Read Also: తెలంగాణలోనే ఈవీల తయారీ: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On : WhatsApp


