Mobile Popup Ad
Mobile Popup Ad

కర్మన్‌ఘాట్ ఆలయంలో SRH బ్యాటర్ పూజలు

కలం, వెబ్‌ డెస్క్‌ : హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కర్మన్‌ఘాట్ ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయాన్ని (Karmanghat Hanuman Temple) సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అభిషేక్ శర్మకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రాల సాక్షిగా స్వామివారికి అభిషేకం జరిపించారు.

దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఐపీఎల్ సీజన్ జరుగుతున్న సమయంలో ఈ యువ క్రికెటర్ ఆలయానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్న అభిషేక్ శర్మ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. సన్‌రైజర్స్ అభిమానులు ఈ ఫొటోలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: టార్గెట్ క్యూబా.. ట్రంప్ మరో సంచలన ప్రకటన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>