ఆరెంజ్ ఆర్మీ ‘సునామీ’.. మట్టికరిచిన కేకేఆర్

కలం, స్పోర్ట్స్: ఉప్పల్ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రౌజర్స్ (KKR vs SRH) చెలరేగింది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో అదరిపోయే పర్ఫార్మెన్స్ చేసింది. కేకేఆర్‌ను 63 పరగుల తేడాతో చిత్తు చేసింది. 226 పరుగుల భారీ స్కోర్‌తో బ్యాటింగ్‌లోనే మ్యాచ్‌ను ఒకవైపు తిప్పేసిన సన్‌రైజర్స్, తర్వాత బౌలింగ్‌లో అదే దూకుడు కొనసాగించి ప్రత్యర్థిని 161 పరుగులకే కట్టడి చేసింది. స్కోర్‌బోర్డ్ చూసినా, మ్యాచ్ ఫ్లో చూసినా.. ఇది ఒక డామినేషన్ స్టేట్‌మెంట్.

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌కు (SRH) ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. పవర్‌ప్లేలోనే బౌలర్లను గట్టిగా టార్గెట్ చేస్తూ మ్యాచ్ టోన్ సెట్ చేశారు. మధ్యలో హైన్రిచ్ క్లాసెన్ తన క్లాస్ చూపిస్తూ హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్‌ను బలపరిచాడు. ఇక నితీష్ కుమార్ రెడ్డి కీలక సమయంలో వేగం పెంచి స్కోర్‌ను 200 దాటించాడు. అయితే డెత్ ఓవర్లలో వచ్చిన డ్రామా మ్యాచ్‌కు మరింత థ్రిల్ జోడించింది. రెడ్డి ఔట్ కావడం, వెంటనే సలీల్ అరొరా ఫస్ట్ బాల్‌కే యార్కర్‌కు బౌల్డ్ అవడం—ఇవి మ్యాచ్ మోమెంటమ్‌ను పూర్తిగా సెట్ చేసిన క్షణాలు.

226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ మొదట్లో ఫిన్ అలెన్ ద్వారా వేగంగా ప్రారంభమైంది. అతని అగ్రెసివ్ షాట్స్ చూస్తే మ్యాచ్ ఒక పెద్ద ఛేజ్ అవుతుందని అనిపించింది. కానీ ఆ స్పీడ్ ఎక్కువసేపు నిలవలేదు. ఒక్కసారిగా వికెట్లు కూలిపోవడం మొదలైందంటే… అక్కడి నుంచి కేకేఆర్ పూర్తిగా ట్రాక్ తప్పింది. అంగ్క్రిష్ రఘువంశి ఒక్కరే ధైర్యంగా పోరాడినా, మిగతా బ్యాటింగ్ లైనప్ పూర్తిగా ఫెయిల్ అయింది. రింకు సింగ్ కొద్దిసేపు ఆశ చూపించినా, అది సరిపోలేదు.

సన్‌రైజర్స్ బౌలర్లు మాత్రం ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. జయదేవ్ ఉనద్కట్ తన అనుభవంతో కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను కట్టడి చేయగా, ఈషాన్ మలింగ, నితీష్ రెడ్డి సమయానికి బ్రేక్‌థ్రూలు ఇచ్చి కేకేఆర్ ఆశలను చిదిమేశారు. ప్రతి ఓవర్‌లో ప్రెషర్ పెంచుతూ చివరకు కేకేఆర్‌ను 161 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. మొత్తానికి ఇది కేవలం ఒక గెలుపు కాదు. సన్‌రైజర్స్ శక్తిని ప్రకటించిన ఘన విజయం. బ్యాటింగ్‌లో దూకుడు, బౌలింగ్‌లో కట్టుదిట్టం. ఇలా అన్ని విభాగాల్లోనూ అదిరిపోయే ప్రదర్శనతో కేకేఆర్‌ను పూర్తిగా కుప్పకూల్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>