‘మీ సేవ’కు అంతరాయం.. ఆన్‌లైన్ సేవల నిలుపుదల

కలం, నల్లగొండ బ్యూరో : సర్వర్ నిర్వహణ పనుల నేపథ్యంలో ‘మీ సేవ’ (Mee Seva) ఆన్లైన్ సేవల (Online Services)కు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏప్రిల్ 3 సాయంత్రం 5 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు, సర్వర్ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్ గ్రేడ్, సాంకేతిక సమస్యల నివారణ కోసం ఈ నిర్వహణ చేపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలు, వెబ్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా పనిచేయవన్నారు. ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు. సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>