కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ హిట్ పెయిర్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం గురించి చాలా కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ జంట ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల రష్మిక (Rashmika Mandanna) ఒంటరిగా ప్రయాణించినట్లు కనిపించింది. దీంతో నెటిజన్లు ‘ఆమె ఎక్కడికి వెళుతోంది?’ అని ఆశ్చర్యపోతున్నారు.
శుక్రవారం రాత్రి రష్మిక ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ఆమె బ్రౌన్ టాప్, బ్లాక్ ప్యాంటు ధరించి క్యాజువల్ లుక్‌లో కనిపించింది. ఫొటోగ్రాఫర్ల అటెన్సన్ ఆమెపై పడింది. రష్మిక కూడా కెమెరాల కోసం నవ్వుతూ ఫోజులిచ్చింది. అయితే రష్మిక ఏమి మాట్లాడలేదు. విజయ్ దేవరకొండతో మ్యారేజ్ రూమర్స్ గురించి అడిగే ప్రయత్నం చేయగా.. సైలంట్‌గా నడుచుకుంటూ వెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆమె ఎక్కడికి వెళుతోంది?’ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల రష్మిక, విజయ్ (VIjay Devarakonda) రోమ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇద్దరు కలిసి వెకేషన్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చర్చకు దారితీసింది.

Read Also: ప్రభాస్ రాజాసాబ్ జోరు.. ఫస్ట్ డే 54 కోట్లు కలెక్షన్స్
Follow Us On: X(Twitter)


