Mobile Popup Ad
Mobile Popup Ad

కడియం అనర్హత పిటిష‌న్‌పై విచారణ వాయిదా

క‌లం, వెబ్ డెస్క్‌: పార్టీ ఫిరాయింపుల నేప‌థ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రిపై (Kadiyam Srihari) దాఖ‌లైన అన‌ర్హ‌త‌ పిటిష‌న్‌పై విచార‌ణను స్పీక‌ర్ వాయిదా వేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన క‌డియం శ్రీహ‌రిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు. నేడు ఈ పిటిష‌న్‌పై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ విచార‌ణ చేప‌ట్టారు. కేపీ వివేకానంద్ స్పీక‌ర్ ఎదుట హాజ‌రై త‌న వాద‌న‌లు వినిపించారు. ఈ పిటిష‌న్‌కు సంబంధించి మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని క‌డియం శ్రీహ‌రి లాయ‌ర్లు స్పీక‌ర్‌కు తెలిపారు.

దీంతో స్పీక‌ర్ ఈ పిటిష‌న్ విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 19కి వాయిదా వేశారు. మ‌రోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay Kumar) పార్టీ మారిన‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ సంజ‌య్‌ అనర్హత పిటిషన్‌ను స్పీక‌ర్ కొట్టివేశారు. ఈ పిటిష‌న్‌లో స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ప్రకటించారు. ఇక‌ ఫిబ్ర‌వ‌రి 18న దానం నాగేంద‌ర్ పిటిష‌న్‌ను స్పీక‌ర్ విచారించ‌నున్నారు.

Kadiyam Srihari
Kadiyam Srihari

Read Also: వాట్ నెక్స్ట్?.. ‘సిట్’ టీమ్‌తో చీఫ్ సజ్జనార్ మీటింగ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>