కలం, మెదక్ బ్యూరో : మెదక్ (Medak) జిల్లా నర్సాపూర్ పట్టణంలో కోతుల దాడి కలకలం రేపింది. స్కూల్‌కు వెళ్లేందుకు టిఫిన్ బాక్స్ పట్టుకుని బస్సు ఎక్కుతుండగా బాలికపై మూకుమ్మడిగా కోతులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. నర్సాపూర్‌కు చెందిన జోష్ణవి (6) అనే బాలికపై ఒక్కసారిగా కోతులు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలికను నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో కోతుల బెడద రోజు రోజుకీ పెరుగుతోందని, చిన్న పిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also: పీఆర్సీ… రెండున్నరేళ్లు దాటినా నో ప్రోగ్రెస్
Follow Us On: X(Twitter)


