కలం, వెబ్ డెస్క్ : స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం (Spain Train Accident) చోటు చేసుకుంది. బుధవారం స్పెయిన్‌లోని టోలెడో మధ్య ప్రావిన్స్‌లో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో 46 మందికి పైగా మరణించారు. ప్రమాదం కారణంగా సియుడాడ్ రియల్, అండలూసియాతో కలిపే రైలు సర్వీసులను నిలిపివేశారు.
రెండు రైళ్లు ఒకే రూట్ లో ప్రయాణిస్తుండగా, ఒకటి మరొకదాని వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో రెండు రైళ్లు పట్టాలు తప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనం వెలువడుతోంది. ప్రమాదంపై స్పందించిన స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Also Read : స్మిత్ మచ్చర్‌కు యూఏఈ పురస్కారం!
Follow Us On : WhatsApp

