ఆల‌యం కూల్చివేత‌పై కాల‌నీవాసుల ఆగ్ర‌హం!

కలం, అచ్చంపేట: అర్ధరాత్రి వేళ‌ దళితుల కుల దేవత ఎల్లమ్మ ఆలయం కూల్చి వేసిన ఘటన నాగర్ క‌ర్నూల్‌ జిల్లా అచ్చంపేట (Achampet) నియోజకవర్గం ఇంద్రనగర్‌ (Indranagar)లో గురువారం చోటుచేసుకుంది. త‌మ‌ తాతల కాలం నుంచి కుల దేవతగా కొలుచుకుంటున్న ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని అచ్చంపేట మున్సిపల్ అధికారులు కూల్చివేశార‌ని కాలనీవాసులు అన్నారు. పోలీసుల సమక్షంలో అర్థరాత్రి ఎవ్వరు లేని సమయంలో నేలమట్టం చేశారని తెలిపారు. అందరు కలిసి స్థానిక త‌హ‌సీల్దార్‌తో పాటు సబ్ కలెక్టర్ సలోని చాబ్రాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. దీనిపై సబ్ కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామ‌ని బాధితులకు హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>