NHM ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. టీడీపీ సంఘీభావం

కలం, కరీంనగర్‌ : ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల (NHM Employees)ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు (TDP Leaders) సంఘీభావం తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాగర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, యువ నాయకుడు కళ్యాడపు నరేష్‌ పటేల్‌ హాజరయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని వారు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగికి క్యాడర్‌ ఫిక్సేషన్‌ అమలు చేసి, 100 శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని నాయకులు కోరారు.

అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలను రద్దు చేసి, ఉద్యోగులందరినీ స్టేట్‌ హెల్త్‌ సొసైటీ (ఎస్‌హెచ్‌ఎస్‌) పరిధిలో కొనసాగించాలని సూచించారు. అలాగే స్పర్శ్‌ (SPARSH) ద్వారా నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2022 నుంచి ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్‌, ఎనిమిది శాతం లాయల్టీ బోనస్‌ ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>