‘కింగ్100’ కు దేవిశ్రీ ఫిక్స్.. హిట్ కాంబో బ్యాక్!

కలం, సినిమా : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కింగ్‌100’ (KING100) సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు.  ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘మన్మథుడు నుంచి మాస్, కింగ్ వరకు.. వీరిద్దరూ కలిసిన ప్రతిసారి చరిత్ర సృష్టించారు’’ అంటూ నాగార్జున-దేవిశ్రీ ప్రసాద్ కాంబోపై ప్రశంసలు కురిపించింది.

నాగార్జున, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన గత చిత్రాల పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కింగ్ 100’ కోసం ఈ సూపర్ హిట్ కాంబినేషన్ మళ్లీ కలవడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు (ఆగష్టు 2) దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘కింగ్ 100’ (KING100)లోకి స్వాగతం పలికింది. ఈ చిత్రానికి రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : నాలో అదే చూస్తారు.. సాయి పల్లవి ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>