పొలం బాట పట్టిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.. ఆయిల్‌పామ్ సాగుపై సమీక్ష

కలం, వనపర్తి: ప్రజా సమస్యల పరిష్కారంలో తీరికలేని షెడ్యూల్ మధ్య కూడా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) వ్యవసాయం, పశుపోషణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆదివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ జరుగుతున్న సాగు పనులను పరిశీలించారు. ఆధునిక వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తూ, ఆయిల్‌పామ్ సాగు చేపట్టనున్న పొలాన్ని పరిశీలించారు. భూసార పరిస్థితులు, సాగుకు అనుకూలత, చేపట్టాల్సిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. అధిక దిగుబడులు వచ్చే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అనంతరం వ్యవసాయ క్షేత్రంలోని ఆవుల వద్దకు వెళ్లి అరటిపండ్లు తినిపించారు. పశువుల ఆరోగ్య పరిస్థితి, పోషకాహారం, సంరక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పశువులకు సమయానికి మేత, పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించడంతోపాటు అవసరమైన వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. పశుసంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చూడాలని సిబ్బందికి ఎమ్మెల్యే (Tudi Megha Reddy) సూచించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తూనే వ్యవసాయం కోసం సమయం కేటాయించడం విశేషం.

Also Read : ‘కింగ్100’ కు దేవిశ్రీ ఫిక్స్.. హిట్ కాంబో బ్యాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>