మునుగోడులో ఉచిత కంటి వైద్య శిబిరం

కలం, చండూరు (మునుగోడు): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం (Free Eye Medical Camp) నిర్వహించారు. ఆదివారం మునుగోడు (Munugode) మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి 16వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, ఇప్పటివరకు 15 విడతలుగా 11,654 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 2490మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేసి 5,272 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశామన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పెద్ద కొడుకుగా మారి కంటి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని తెలిపారు.

ఆదివారం నిర్వహించిన శిబిరంలో (Free Eye Medical Camp) 415 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 157 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారన్నారు. ఈ ఆపరేషన్లకు ఎంపికైన వారిని హైదరాబాద్ నానక్ రాంగూడ లో ని శంకరా కంటి ఆసుపత్రికి శాస్త్ర చికిత్సకు పంపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Also Read : కంటి చుక్కల్లోనూ కల్తీ..! ఉత్పత్తులను వెనక్కి తీసుకున్న కంపెనీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>