కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో శివ మార్కండేయ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆషాడ మాస అమ్మవారి బోనాల వేడుకలు (Bonalu Celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం శివసత్తులు, పోతరాజుల వేషధారణలు, డప్పు వాయిద్యాల సందడితో బోనాల ఊరేగింపు ఘనంగా ప్రారంభమైంది. సంఘ సభ్యులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
శ్రీనగర్ కాలనీ నుంచి మారమ్మ ఆలయం వరకు సాగిన బోనాల ఊరేగింపులో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. అనంతరం ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. పసుపు, కుంకుమలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శివ మార్కండేయ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Also Read : వాస్తాపూర్ వాటర్‌ఫాల్స్‌ని చూసోద్దాం రండి!
Follow Us On : WhatsApp

