నిర్మ‌ల్‌ జిల్లా పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్

క‌లం, నిర్మ‌ల్‌: వీక్లీ పరేడ్ నిర్వహించడం వల్ల సిబ్బందిలో విధి నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, శారీరక దృఢత్వంతో ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ (Nirmal Police) ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్ రిజర్వ్, ఆర్మ్డ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్‌లో పాల్గొన్న సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.

అనంతరం ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు (Police) శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే చెడు వ్యసనాలకు అలవాటు పడి విధులను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఇన్‌స్పెక్ట‌ర్లు గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, సమ్మయ్య, రిజర్వ్ ఇన్‌స్పెక్ట‌ర్లు రామ్ నిరంజన్, శేఖర్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: చినుకు రాలదు.. మొలక మొలవదు..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>