కలం, క్రైమ్ బ్యూరో: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) ని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో అత్తాపూర్ పోలీసులు గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించనున్నారు. రాజేంద్రనగర్లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. తనను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

